Thursday, September 29, 2011

నేటి నానోలు

1
ప్రేమ
ఆవేశం
పెళ్లి
అవగాహన -


2
మూడుముళ్ళు
బంధం
ఏడడుగులు
అనుబంధం-


3
ప్రేమ
మనసుకు
పెళ్లి
వయసుకు-


4
పెళ్లి
సాక్షిగా
ప్రేమ
బలి-


5
ప్రేమకు
పంచభూతాలసాక్షి
పెళ్లికి
బంధుమిత్రులసాక్షి-

Monday, September 19, 2011

నేటి నానోలు

1
నిదురించబోతూ
కలల
రుచి
ఎందుకు?

2
ఆకర్షణ
మూణ్ణాళ్లు
ప్రేమ
ఉన్నన్నాళ్లు-

3
‎కళ్లముందు
కనిపించే
స్వప్నం
సినిమా-

4
సముద్రతీరం
పిల్లగాలి
నువ్వూ
నేనే-


5
నీకూ
నాకూ
మధ్య
మౌనరాగం-

6
నామీద
టపటపా
చినుకులు
మేఘసందేశం-
 

Saturday, September 10, 2011

నేటి నానోలు

1
వయసు
తనువుకే...
మనసుకు
కాదు -

2
మనసు
ఉరకలు
వయసు
చురకలు-

3
మనసు
మనిషి
అద్దం
ప్రతిబింబం-

4
మనసు
మంచిదైతే
మనిషి
దేవుడే-
 

Friday, September 9, 2011

నేటి నానోలు

‎1
తవ్వగ
తవ్వగ
కొండలు
లోయలు-

2
కెరటం
తీరం
ఆలోచన
అక్షరం-

3
గుండె
చెరువు
కళ్లు
చేపలు-

4
పెద్దల
అనుభవాలు
పిల్లలకు
భయాలు-

5
అలంటే
భయంలేదు
వలంటేనే
భయం-

Wednesday, September 7, 2011

Monday, September 5, 2011

నేటి నానోలు

‎1
ఆకాశం
పులకరించింది
పూలవాన
కురిసింది -

2
ఈరోజు
నాది
రేపు
తెలీదు -

3
ప్రేయసి
ప్రేమ
అల్లుకొనే
మల్లెతీగ -

4
పూజకు
వేళయింది
పూలకు
ప్రాణసంకటం -

5
పూలకు
ఉరి
దేవుడికి
హారం -

6
నిన్న
జ్ఞాపకం
రేపు
స్వప్నం -

7
మూసిన
కనులు
కథలు
కోకొల్లలు -

Sunday, September 4, 2011

చిరుజల్లు

బయట
చిరుజల్లు
లోపల
హరివిల్లు -

ఎదురుగా అద్దం

ఎదురుగా
అద్దం
అందులో
ఎవరో?

Saturday, September 3, 2011

నాలుగు పదాలు

నాలుగు
పదాలు
నూరు
అర్థాలు -
 

Friday, September 2, 2011

ప్రేమ-పెళ్లి

ప్రేమ
ట్రైలర్‌
పెళ్లి
సీరియల్‌ -

అన్నా

అన్నా
అన్న
పిలుపుకు
స్పందించనిదెవరు?

 

నింగి-నేల

నింగికి
నేలకు
నిచ్చెన
వాన -

 

ప్రమాదం

పక్షులు
కలకలం
పొంచివుంది
ప్రమాదం -

 

Wednesday, August 31, 2011

మొదలు-తుది

మొదలు
తుది
రెండిట్లో
ముందేది?

మనసు

మనసు
మౌనవ్రతం
బుద్ధి
వెలుగునేత్రం-

Tuesday, August 30, 2011

గుండె రాయైతే...

గుండె
రాయైతే...
కళ్లు
ఎడారే -

రాళ్ళూ..రప్పలు

రాళ్ళూ
రప్పలు
నమ్మితే
దేవుళ్లు -

Monday, August 29, 2011

చుట్టూ మనుషులే

చుట్టూ
మనుషులే -
మానవత్వం
ఎక్కడ?

ఆలోచనల వరద...

ఆలోచనల
వరద...
కొట్టుకు
పోతున్నా-

చేయి చేయి

చేయి
చేయి
కలిస్తే
చిత్తడే -

పెద్దలమాట

పెద్దలమాట
చద్దిమూట
ఎవరైనా
వింటున్నారా?

Saturday, August 27, 2011

విదేశం

విదేశం
ఉద్యోగం
మాతృదేశం
వియోగం-

కాలం

కరిగిన
కాలం
గుర్తురాని
స్వప్నం-

అభిమానం

అభిమానం
ఆభరణం
అవమానం
మరణం-

జీతం

జీతం
పెద్దదే..
జేబుకు
చిల్లుంది -

నేర్చుకో

నేర్చుకో
జీవించడం
అనిశ్చయంతో
అప్పుడప్పుడు -

Friday, August 26, 2011

అవినీతి

అవినీతి
చెట్టు
మెదడు
భూమి-

అభిమానం

అభిమానం
ఆభరణం
అవమానం
మరణం-

ఆలోచన

ఆలోచన
విత్తనం-
ఆచరణ
వృక్షం-

సమస్య

సమస్య
చిన్నది
జీవితం
పెద్దది

సహనం

సహనం
విజయం
అసహనం
వినాశం-

ఆశలు

ఆశలు
ఇసుకగూళ్ళు
కాలం
కెరటాలు-

ప్రేమ

ప్రేమ
స్వప్నం-
పెళ్ళి
వాస్తవం-

ద్వేషం

ద్వేషానికి
విరుగుడు-
ప్రేమ,
వాత్సల్యం!

ఇది నాదే

ఇది
నాదే
అంటూ
ఏముంది?

మతం

మతం
విభాజకం-
సమ్మతం
గుణకం-

ఏటిగట్టు

ఏటిగట్టు -
నువ్వూ
నేనూ
కాలమాగిపోతే...

ప్రజాస్వామ్యం

 నిరంకుశంగానైనా
 సరే
 ప్రజాస్వామ్యం
 రావాల్సిందే!

రైతు

రైతు
పిచ్చుక..
దళారి
గద్ద!